ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కపటప్రేమని తెలుసుకున్న కొడుకు.. భార్య చెప్పింది వినలేదని గిల్టీ!

on Dec 23, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -286 లో..... శ్రీలత కపట ప్రేమని సీతాకాంత్ కళ్లారా చూసి బాధపడతాడు. ఈ ముసలోడిని ఏం చేద్దామని సందీప్ అనగానే గదిలో ఉంచండి అని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత తనపై చూపించిన ప్రేమని గుర్తుచేసుకుంటాడు సీతాకాంత్. శ్రీలత గురించి చెప్పిన వినలేదన్న విషయం గుర్తుచేసుకొని గిల్టీగా ఫీల్ అవుతాడు సీతాకాంత్.

ఆ తర్వాత సందీప్, ధనలు పెద్దాయనని గదిలో బందిస్తారు. అప్పుడే రౌడీలు వచ్చి మీ అన్న వదినలు ఎక్కడున్నారని వాళ్ళు అడుగగా.. సందీప్ చూపిస్తాడు. ఆ తర్వాత రౌడీలు సీతాకాంత్ దగ్గరికి వెళ్తారు. తనని కొడుతారు నాకు బతుకు మీద అశ లేదని రౌడీలతో సీతాకాంత్ అంటుంటే.. రౌడీలు ఇంకా కొడుతుంటారు. అప్పుడే సీతాకాంత్ ని వెతుక్కుంటూ వస్తుంది రామలక్ష్మి. రౌడీలని చూసి వాళ్ళకి ఎదురుతిరుగుతుంది. దాంతో రామలక్ష్మిని వాళ్లు నెట్టేస్తారు. అది చూసి సీతాకాంత్ రౌడీలని కొడతారు. వాళ్లు పారిపోతారు. రామలక్ష్మిని హగ్ చేసుకొని సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రౌడీలు పారిపోవడం సందీప్, శ్రీలత, శ్రీవల్లి లు చూసి ఈసారి కూడా ప్లాన్ ఫెయిల్ అని డిస్సపాయింట్ అవుతారు.

ఆ తర్వాత సీతాకాంత్ తనకి తన తల్లి గురించి తెలిసిందని రామలక్ష్మికి చెప్పడు. నేనేం చేసినా నాకు సపోర్ట్ చేస్తావా అని సీతాకాంత్ అడుగుతాడు. మీరేం చేసినా మీతో నేను అని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకొని రమ్మని అంటాడు. ఆ తర్వాత పెద్దాయనను గదిలో చూసి రామలక్ష్మికి తెలియకూడదని తనని పంపించి.. మేనేజర్ కి కాల్ చేసి పెద్దాయనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత  పెద్దాయన దగ్గరికి సందీప్ వచ్చి చూసేసరికి.. అతను లేకపోవడంతో టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.